My Ganesha Collection

My Ganesha Collection

Friday 2 November 2012

Introduction


నాకు ఉన్నఅనేక హాబీలలో మొట్టమొదటిది, అతి ముఖ్యమయినది వినాయకుని ఫోటోలు కలెక్ట్ చేయటం. గత అయిదు ఏళ్ళుగా వీటిని సేకరిస్తున్నాను. నా బ్లాగు లో కూడా నా ఈ హాబీ గురించి రాయటం జరిగినది (www.vanworksandthoughts.blogspot.com)ఫోటోలు అంటే మామూలు మూర్తి ఫోటోలు అనుకునేరు. అలా కాదు. ప్రతి దానిలోనూ వెరైటీ వుండాలి. వినాయకుడి విగ్రహాలు వివిధ రూపాలలో ప్రదర్శింప చేస్తారు ప్రతి ఏడాది. రకరకాల ఆకారాలలో, రకరకాల వస్తువులతో, రకరకాల వస్తువుల మీద కొలువు తీరుస్తారు. అలా అలోచించి నేను గూగుల్ లో వెతకటం ప్రారంబించాను. అలా వెతుకుతూ పోతువుంటే నేను అనుకోనివి, నాకు తట్టనివి, అబ్బో యిలా కూడా ఉంటాయ అనేట్లు ఉండేవి ఇలా చాలా రకాలు దొరికాయి. ఇవి అన్ని సేకరించి వివిధ category లుగా విభజించి ఫోటోలు అప్లోడ్ చేయాలనే ఆలోచన వచ్చింది.
నా కలెక్షన్ అంతా పికాస లో ఫోటో ఆల్బం లాగా అప్లోడ్ చేస్తే బాగుంటుందా లేక దీనికి ప్రత్యేకమయిన బ్లాగునే ఓపెన్ చేస్తే బాగుంటుందా అని చాలా ఆలోచించిన మీదట నాకు బ్లాగు ఓపెన్ చేయటమే బాగా అనిపించిందిదాని ఫలితమే  (www.myganeshacollection.blogspot.com). 
                    అబ్బ వినాయకుడిని ఎన్ని విధాలుగా రూపొందించవచ్చు అండి.... అసలు ఆలోచనకే చిక్కనన్ని ప్రతిమలు. కొన్ని అయితే నాచురల్ గా ఫారం అయినవి. ఉదాహరణకి టమాట ఆకారం లో, ఆపిల్ పండు ఆకారం లో ఇలా అనమాట. ఇంకా వివిధ రకాల లోహాలతో చేసినవి, పదాలతో వినాయకుని ప్రతిమలు, ఆర్టిస్టిక్ స్కెచ్చులతో, డాన్సులు చేస్తూ, వాయిద్య పరికరాలతో, zodiac సయినులతో, ఒకటేమిటి రకరకాల ఫోటోలు దొరికాయి. నాకే గొప్పగా యీ ఆలోచన వచ్చింది అనుకుంటే, నన్ను మించి కొంత మంది అయితే వెబ్ సైట్లు కూడా ఓపెన్ చేసారు. facebook లు, flicker లు ఇలా ఎన్నో మొదలు పెట్టారు. కాకపోతే నా లాగా బ్లాగు ఓపెన్ చేసిన వారు మాత్రం నాకు తారస పడలేదు.                     
                   నా బ్లాగును చుసిన వారు తప్పకుండా నన్ను అభినందిస్తారని కోరుతూ....
                                           వినాయకుడు మా కుటుంబమును అన్ని విధములుగా కాపాడును గాక. జై గణేష్ జీ

No comments:

Post a Comment